విశాఖపట్నం వన్ టౌన్ పాత పోస్ట్ఆఫీస్ సమీపంలో ఉన్న క్వీన్ మేరీ గర్ల్స్ హై స్కూల్ లో వేదాంత లిమిటెడ్ -వి.జీ.సి.బి పోర్ట్ వారి ఆర్థిక సహాయంతో ఆఫ్రో ఆర్గనైజేషన్ వారి ద్వారా నిర్మించిన ఆడిటోరియం షెడ్ ను నేడు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ చేతుల మీద ప్రారంభోత్సవం జరిగింది. నేటి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరియు తల్లి తండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ వేదాంత వారు స్కూల్ కి మరియు కమ్యూనిటీ కి అనేక విధములైన ఆర్థిక సహాయం అందించుచు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయుచున్నారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి 39 వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్, వేదాంత లిమిటెడ్- వి.జి. సి.బి పోర్టు , సీ.యస్.ఆర్ హెడ్ & పి. ఆర్ జె ఎస్ శ్రీలక్ష్మి, కంపెనీ సెక్రటరీ సాయీఫ్ ఖాన్, ఆఫ్ఫ్రో ప్రాజెక్టు మేనేజర్ కే.విజయభాస్కర్, ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ వై.అశోక్ కుమార్ . స్థానిక నాయకులు, పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు వర్మ, పాఠశాల యొక్క ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
