Tv424x7
Andhrapradesh

సోషల్ మీడియా వినియోగంపై విద్యార్థులకు అవగాహన తప్పనిసరిపి.ఎస్.ఐ జగదీశ్వర్ రెడ్డి

ఇంటర్ నెట్, సోషల్ మీడియా వినియోగంపై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని బద్వేలు పి.ఎస్.ఐ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్.పి ఇ.జి అశోక్ కుమార్ అదేశాల మేరకు గురువారం బద్వేలు పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ లో విద్యార్థులకు పి.ఎస్.ఐ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ నెట్ ద్వారా ఎంత మంచి జరుగుతుందో అంతే స్థాయిలో చెడుకు కూడా అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సోషల్ మీడియా వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చదువులు, నైపుణ్యాలు నేర్చుకునే దశలో, సామాజిక మాధ్యమాల వలలో చిక్కుకుంటే భవిష్యత్తు నష్టపోవాల్సి వస్తుందన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

విల్లూరి భాస్కర్ రావు మరియు బుచ్చా రామ్ రెడ్డి ఆధ్వర్యంలో సి హారస్ నివాసులు చేరిక

TV4-24X7 News

తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని 16వ మలుపు వద్ద ఘోరం

TV4-24X7 News

ఏపీలో హైకోర్ట్ సంచలన తీర్పు

TV4-24X7 News

Leave a Comment