ముఖ్యఅతిథిగా పాల్గొన్న విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
విశాఖపట్నం జీవీఎంసీ ప్రీమియర్ హై స్కూల్ చెంగళరావు పేట, ప్రభుత్వ క్వీన్ మేరీ బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ శనివారం ఘనంగా జరిగినది. ప్రభుత్వ క్వీన్ మేరీ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వంశీ కృష్ణ యాదవ్ విశాఖ దక్షిణ శాసనసభ్యులు మరియు స్థానిక కార్పొరేటర్ సాదిక్ హాజరై విద్యార్థినులకు మరియు తల్లిదండ్రులకు తగు సూచనలిచ్చారు.ప్రధానంగా పిల్లల దగ్గర మన కుటుంబ మరియు సమస్యల విషయములు ప్రస్తావించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసారు.ఎమ్మెల్యే పాఠశాలకు కావలసిన సహాయ సహకారములు అందిస్తామని, ఏమైనా సమస్యలున్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థినులను అభినందించారు. పాఠశాల యాజమాన్యం హాజరైన తల్లిదండ్రులకు భోజన సదుపాయం కల్పించడమైనది. ముఖ్యంగా పేరెంట్స్ కమిటీ, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది సహకారంతో ఈనాటి సమావేశం ఘనంగా నిర్వహించబడినది. ఈ కార్యక్రమం ఇంచార్జి ప్రిన్సిపాల్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సి.ఐ జి.డి.బాబు వారు సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.జీవీఎంసీ ప్రీమియర్ హై స్కూల్ లో జరిగిన కార్యక్రమానికి ఎస్.ఎం.సి చైర్మన్ ఎం.సంధ్య, ఎస్.ఎం.సి వైస్ చైర్మన్ ముఖ్యాతిథులుగా పాల్గొని హాజరైన విద్యార్థినులకు మరియు తల్లిదండ్రులకు తగు సూచనలిచ్చారు. ఎ.గుప్తా, హెడ్ మాస్టర్ బుచ్చిబాబు ఉపాధ్యాయులు మరియు సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని ఘానంగా జరిపించారు.ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.