Tv424x7
Andhrapradesh

తిరుమలలో భారీ వర్షం.. ఆ దారులు మూసివేత…

గురువారం తిరుమలలో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో కొనసాగుతూన్న అల్పపీడనంతో ప్రభావంతో తిరుమలతో పాటు తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో తిరుమల వెళ్లిన భక్తులు ఇబ్బంది పడ్డారు,భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఘాట్ రోడ్ లో కొండ చెరియలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాహనదారులకు పలు సూచనలు చేసింది.ఘాట్ రోడ్ ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలని కోరింది.

పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలు టీటీడీ అధికారులు తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రకటించారు.వర్షం తగ్గిన వెంటనే ఆ రెండు మార్గాలను పునరుద్ధరిస్తామని తెలిపింది. తిరుమలలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. భారీ వర్షాలతో తిరుమల పురవీధులు నీటితో నిండిపోయాయి. తిరుమలలో వర్షంతో పాటు చలి తీవ్రత కూడా ఉంది.తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ స్లాట్ బుక్ చేసుకున్న భక్తులు అక్కడి చేరుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా.. టైమ్ స్లాట్ టోకన్ దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 65 వేల 887 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేలకు పైగా భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.88 కోట్లుగా ఉంది…

Related posts

అసెంబ్లీలో అవమానాన్ని భరించలేకపోయా :చంద్రబాబు

TV4-24X7 News

నంద్యాల ఎస్పీ రఘువీరా రెడ్డి పై చర్యలకు ఈసీ ఆదేశం

TV4-24X7 News

జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్త శిబిరం

TV4-24X7 News

Leave a Comment