Tv424x7
Andhrapradesh

ఎపి మోడల్ విద్యావ్యవస్థకు అధికారులు నడుం బిగించాలి

అమరావతి: గత అయిదేళ్లలో విద్యారంగాన్ని పట్టించుకోలేదు…రాబోయే 5ఏళ్లలో మౌలిక సదుపాయాలు, ఫలితాలపై దృష్టిసారించి ఎపి మోడల్ విద్యావ్యవస్థ రూపకల్పనకు అధికారులంతా నడుంబిగించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో మానవవనరుల శాఖపై సమీక్షలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్ రోల్ మెంట్ పెరగాలి… జీరో డ్రాపవుట్స్ ప్రభుత్వ లక్ష్యం.ప్రభుత్వ స్కూళ్లలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు, ఎకడమిక్ ఫలితాలకు పొంతన ఉండటం లేదు, పారదర్శకమైన విధానాలతో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలి. మౌలిక సదుపాయాలు, ఎకడమిక్ పెర్ఫార్పెన్స్ ను పొందుపరుస్తూ జిల్లాలవారీగా ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులను అందజేస్తున్నాం. రాబోయే వందరోజుల యాక్షన్ ప్లాన్ కు అనుగుణంగా అధికారులు దృష్టిసారించాలి. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనంపై దృష్టి సారించాలి. పోషకవిలువలు కలిగిన పౌష్టికాహారం అందజేసేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం లోకల్ మెనూతో మధ్యాహ్న భోజనం అందించే వెసలుబాటును కలెక్టర్లకు కల్పించాం. ఉన్నత విద్యలో కూడా హాస్టల్, భోజన సౌకర్యాలపై దృష్టిపెట్టాలి. ఇటీవల కాలంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. హాస్టళ్లలో శానిటేషన్ నిర్వహణ, కనీస మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. ఇందుకోసం ప్రతివారం విద్యార్థులనుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే విధానాన్ని చేపట్టాం. ఫీడ్ బ్యాక్ ఆధారంగా మెస్, సౌకర్యాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలి. పాఠశాలలు, కళాశాలల్లో మత్తుపదార్ధాల నివారణకు డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాం. అన్ని స్కూళ్లు, కాలేజిల్లో ఈగల్ టీమ్స్, క్లబ్స్ ఏర్పాటుచేసి పెద్దఎత్తున విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలి. కెజి టు పిజి కరిక్యులమ్ ప్రక్షాళనను చర్యలు చేపడుతున్నాం. అపార్ ఐడి విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. దీనివల్ల తల్లిదండ్రుల ఇబ్బంది పడ్డారు. సాంకేతిక సమస్యలు అధిగమించి పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులంతా కృషిచేయాలని మంత్రి లోకేష్ కోరారు.

Related posts

ఏపీలో త్వరలో ఎస్సీలకు రూ.50,000 రాయితీతో రుణాలు

TV4-24X7 News

ఉత్తమ పోలీసు సిబ్బందికి రివార్డులు

TV4-24X7 News

పెందుర్తి పోలీసులుబెల్టు షాపులపై మెరుపు దాడి

TV4-24X7 News

Leave a Comment