Tv424x7
Andhrapradesh

మానవసావే మాధవసేవంటున్న వన్ టౌన్ సీఐ జీడీ బాబు

విశాఖపట్నం సిటీ పోలీస్ మరియుపోలీస్ కమిషనర్ టీమ్స్ 09.12.24 తేదీనాడు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుండి డార్జిలింగ్ నుండి. గురుంజి అనే వ్యక్తి వాళ్ల భార్య బెంగళూరులో సర్వెంట్ మేడిగా జాబ్ చేస్తుందనీ ఆమెను చూడటానికి ట్రైన్లో బయలుదేరి 11. 12 .2024 తేదీ నాడు విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగి ఫుడ్ ఐటమ్స్ కొనుక్కోడానికి దిగగా ట్రైన్ వెళ్లిపోవడం జరిగింది. తదుపరి ఆయన రైల్వే స్టేషన్ బయటికి వచ్చినప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది కె జి హెచ్ నకు ట్రీట్మెంట్ లకు వెళ్లడం జరిగింది. అక్కడ పోలీస్ వారు ఆయనని గమనించి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. తదుపరి ఆయన ఎవరికి చెప్పకుండా కేజీహెచ్ నుంచి ఎస్కే పై వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో అతని నుండి నానాజీ అనే కానిస్టేబుల్ వారి భార్య నెంబర్ను సేకరించి ఆమెకు ఫోన్ చేయగా వారు వైజాగ్ వచ్చి పోలీస్ సిబ్బందితో కలిసి వెతకడం జరిగింది. అయినా అతని జాడ కనబడలేదు. కానీ వన్ టౌన్ పట్టు విడవని విక్రమార్కుడిలా పోలీస్ వారు మాత్రం అతన్ని సుమారు నాలుగు రోజుల నుండి వెతకగా.. నిన్న కొత్త రోడ్ జంక్షన్ లో కనబడగా అతనికి అన్ని సపర్యులు చేస్తూ బట్టలు కొనిచ్చి భోజనాలు కూడా పెట్టి ఒక సొంత కుటుంబ సభ్యులు లాగా ఈరోజు వరకు అన్ని సఫర్లు చేయడం జరిగింది. ఈ విషయాన్ని వారి యొక్క కుటుంబ సభ్యులకు తెలియజేయగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు రాగ వారి సమక్షంలో తప్పిపోయిన వ్యక్తిని అప్పగించడం జరిగింది. అలాగే ఆ కుటుంబ సభ్యులకు భోజనాలు అన్నీ కూడా పోలీస్ వారే స్వయంగా దగ్గరుండి పెట్టించి దారి ఖర్చులకి డబ్బులు ఇచ్చి వారిని తిరిగి వెస్ట్ బెంగాల్ లకు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ కి మరియు వన్ టౌన్ పోలీస్ వారికి ప్రత్యేకంగా. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మీకు మేము రుణపడి ఉంటామని మీ సేవలు మేము మరువలేమనిఈ సందర్భంగా వారు పోలీసు వారు చేసిన సేవలను ఎంతగానో కొనియాడారు తప్పిపోయిన భర్తను అప్పగించినందుకు చెప్పలేని ఆనందంతో పోలీసు వారికి పాదాభివందనం చేయడం జరిగింది. పోలీసులంటే దేవుళ్ళని ఇంత త్వరగా సిటీ పోలీస్ వారు స్పందించి నా తీరు చూసి వారు మీకు మేము ఏమిచ్చి రుణం తీర్చుకోగలమని ఆనందభాష్పాలతో అభినందనలను తెలియజేయడం జరిగింది.

Related posts

ఒకే వేదికపైకి మోదీ, చంద్రబాబు, పవన్ – ఇవాళే ‘ప్రజాగళం’ సభ

TV4-24X7 News

మ‌హానాడు చూశాక‌.. వైసీపీలో మార్పులు త‌ప్ప‌వా..!

TV4-24X7 News

ఏప్రిల్ 7 నుంచి అడ్మిషన్లు.. వేసవి సెలవుల్లో మార్పు..!

TV4-24X7 News

Leave a Comment