తెలంగాణ అసెంబ్లీలో ఫార్మూలా-ఈ కారు రేసు(Formula -E Car Race)పై చర్చకు బీఆర్ఎస్(BRS) సభ్యులు శుక్రవారం పట్టుబట్టారు.తెలంగాణ అసెంబ్లీలో ఫార్మూలా-ఈ కారు రేసు(Formula -E Car Race)పై చర్చకు బీఆర్ఎస్(BRS) సభ్యులు శుక్రవారం పట్టుబట్టారు.దీంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీని వాయిదా వేశారు.అసెంబ్లీలో ఫార్మూలా-ఈ కారు రేసుపై బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. భూభారతిపై చర్చించాలని ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.ఫార్మూలా-ఈ కారు రేసుపై బీఆర్ఎస్ సభ్యుల డిమాండ్ఫార్మూలా- ఈ కారు రేసుపై బీఆర్ఎస్ సభ్యులు శాసనసభలో డిమాండ్ ను లేవనెత్తారు. మాజీ మంత్రి హరీష్ రావు ఈ విషయమై ప్రస్తావించారు. ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసినందున పార్మూలా ఈ రేసుపై చర్చించాలని కోరారు. ఫార్మూలా-ఈ కారు రేసు విషయమై ఈ సభలో సభ్యుడిగా ఉన్న కేటీఆర్ (KTR) పై ఏసీబీ (ACB) కేసు నమోదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ఈ కేసు నమోదైనందున చర్చించాలని కోరారు.అయితే భూభారతిపై ప్రభుత్వ బిల్లు ఉన్నందున దాని తర్వాత పరిశీలిస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పారుభూభారతిపై చర్చ ప్రారంభించిన పొంగులేటిబీఆర్ఎస్ సభ్యులు ఫార్మూలా-ఈ కారు రేసుపై చర్చించాలని నినాదాలు చేశారు. అదే సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతిపై చర్చను ప్రారంభించారు. బీఆర్ఎస్ సభ్యులు సభలో వెల్ లోకి వెళ్లి నిరసన తెలిపారు. మరో వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను రెచ్చగొట్టేలా వ్యవహరించిందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ తమపై పేపర్ ను బాల్స్ మాదిరిగా చుట్టి తమపై విసిరారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పై పేపర్లు చింపి విసిరివేశారని అధికారపక్షం చెబుతోంది. దళిత స్పీకర్ ను బీఆర్ఎస్ అవమానించిందని ఆ పార్టీ విమర్శలు చేస్తోంది. ఒకానొక దశలో స్పీకర్ వైపు బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహంతో వచ్చారని ఆ పార్టీ ఆరోపణలు చేశారు.తమ పార్టీ సభ్యులపై కాంగ్రెస్ కు చెందిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ చెప్పు చూపారని గులాబీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు

previous post