చలికాలంలో మనకు సీజనల్ వ్యాధులు అనేకం వస్తుంటాయి. దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ ఈ సీజన్లో మనల్ని ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. కాస్తంత చల్లని నీళ్లను తాగినా చాలు వెంటనే ముక్కు దిబ్బడ వచ్చేస్తుంది. అలాగే దగ్గు కూడా వస్తుంది. ఈ సీజన్లో మన ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది. దీనికి తోడు ఎండ తక్కువ ఉంటుంది కనుక మనకు విటమిన్ డి కూడా చాలా తక్కువగా లభిస్తుంది. అయితే ఈ సీజన్లో వచ్చే అన్ని సమస్యలకు చెక్ పెడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు నిమ్మరసం తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ ఉదయం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగితే ఎన్నో లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు. చలికాలంలో ఈ విధంగా కచ్చితంగా తాగాలని వారు సూచిస్తున్నారు.లివర్ క్లీన్ అవుతుంది..మన శరీరంలో లివర్ అనేక కీలక విధులను నిర్వహిస్తుంది. లివర్ సుమారుగా 800 పైగా జీవక్రియలను నిర్వహిస్తుంది. అయితే చలికాలంలో లివర్ పనితీరు మందగిస్తుంది. దీంతో వ్యర్థాలు, కొవ్వు పేరుకుపోతాయి. దీంతో లివర్ వ్యాధులు
