అల్లు అర్జున్ విడుదల అయ్యాక సైలెంట్ గా ఇంటికి వెళ్లిపోయుంటే బాగుండేదేమో..!
➤ ఆరోజే.. టాలీవుడ్ మొత్తం పరామర్శకు బన్నీ ఇంటికి క్యూ కట్టడం, అదేదో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లా ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం, అక్కడ హీరోల ఇకఇకలు పకపకలు… ఇవన్నీ విషయాన్ని పక్కదోవ పట్టించాయి.
➤ ఓ మహిళ చనిపోయి, ఓ పిల్లాడు ప్రాణాలతో పోరాడుతుంటే.. ఇంత హంగామా అవసరమా? అన్నది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాయింట్.
➤ బన్నీని పరామర్శించడానికి వెళ్లిన సినిమావాళ్లంతా ఆసుపత్రిలో ఉన్న పిల్లాడ్ని చూడ్డానికి ఎందుకు వెళ్లలేదు? అని ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలో లాజిక్ ఉంది.
➤ ఈ ఇష్యూని ప్రభుత్వం ఎంత సీరియస్‌గా తీసుకొందో… ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని బట్టి అర్థం అవుతోంది.
➤ బన్నీ బెయిల్ రద్దు అవుతుందని, ఆయన మళ్లీ అరెస్ట్ అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వాటికి మరింత బలాన్ని చేకూర్చినట్టు అనిపిస్తోంది.