Tv424x7
Cinima News

వార్‌ 2 : ఎన్టీఆర్‌ గురించి స్పెషల్‌ న్యూస్‌

హృతిక్‌ రోషన్‌తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ వార్‌ 2 లో నటిస్తున్న విషయం తెల్సిందే. బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న వార్‌ సినిమాకు ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది. ఈమధ్య కాలంలో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేర్‌ చేస్తున్న స్పై థ్రిల్లర్‌ యాక్షన్‌ సినిమాల జోనర్‌లోనే ఈ సినిమా ఉండబోతుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్ర గురించి కొత్త చర్చ జరుగుతోంది.హృతిక్‌ రోషన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ విలన్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు అనేది మొదటి నుంచి వినిపిస్తున్న మాట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ ఈ సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్‌ లో కనిపించబోతున్నాడట. బాలీవుడ్‌లో జరుగుతున్న చర్చ ప్రకారం ఎన్టీఆర్‌ నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రతో పాటు హీరో లక్షణాలు ఉండే పాత్రలోనూ కొంత సమయం కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకే పాత్ర రెండు విభిన్నమైన షేడ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఎన్టీఆర్‌ డ్యూయెల్‌ రోల్‌లో అయినా నటించి ఉండాలి అనేది సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.మొత్తానికి ఎన్టీఆర్‌ చేస్తున్న వార్‌ 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలుస్తుంది అంటూ హిందీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సౌత్‌ ప్రేక్షకులు సైతం నమ్మకంగా ఉన్నారు. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కాంబోలో వచ్చే సన్నివేశాలు, ఎన్టీఆర్‌ డబుల్‌ షెడెడ్‌ సన్నివేశాలు సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుతూ ఉన్నారు. 2025 ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్టీఆర్‌కి జోడీగా హీరోయిన్‌ ఉండక పోవచ్చు అని తెలుస్తోంది.

Related posts

కన్న కూతురు బిడ్డనే ఎత్తుకెళ్లిన తాత – తాగుడుకు బానిసై దిగజారిన పెద్దరికం

TV4-24X7 News

ప్రభాస్ ‘కల్కి’ మూవీ నుంచి సర్ప్రైస్ వీడియో

TV4-24X7 News

Y.s.వివేకానంద రెడ్డి బయోపిక్

TV4-24X7 News

Leave a Comment