ఏపీలో పర్యాటక ప్రాంతం అరకులో ఈ నెల 12న సుప్రీం కోర్టు జడ్జిలు పర్యటించ నున్నారు. CJI, 25మంది జడ్జిలు, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి రానుండటంతో అల్లూరి జిల్లా జేసీ ఏర్పాట్లు చేస్తున్నారు. వారు ఆదివారం విశాఖ నుంచి రైలులో బయలుదేరి ఉ.10.30కు అరకులోయకు చేరుకుంటారు. హరిత వేలీ రిసార్టులో విశ్రాంతి అనంతరం గిరిజన మ్యూజియం,గిరి గ్రామదర్శిని, అనంతగిరి కాఫీ తోటలు, బొర్రా గుహలు సందర్శిస్తారని జేసీ తెలిపారు.
