Tv424x7
Andhrapradesh

సింహాచలం బాధిత కుటుంబాలకు వైస్సార్సీపీ ఆర్థిక సాయం

సింహాచలం బాధిత కుటుంబానికి వైఎస్సార్‌సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది.మరోవైపు చంద్రంపాలెంలో బాధిత కుటుంబాన్ని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పరామర్శించిన ఓదార్చిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమే సింహాచలం అప్పన్న ఆలయంలో ఏడుగురి ప్రాణాలు పోయేందుకు కారణమైందని మండిపడ్డారు.మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Related posts

జగన్ – QR కోడ్‌ ఉద్యమం ఎలాగో తెలుసా…? భారీ ప్రణాళికే…!

TV4-24X7 News

భూమిచ్చిన భూ నిర్వాసితులకు ఉద్యోగ హామీపై హైకోర్టు ఆగ్రహం.

TV4-24X7 News

జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్.. వైఎస్ జగన్ న్యూలుక్ వైరల్..!

TV4-24X7 News

Leave a Comment