Tv424x7
National

పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం.. సంచలన విషయాలను వెల్లడించిన కల్నల్ సోఫియా

పాకిస్తాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో పాక్ మిస్సైల్స్ నిర్వీర్యం చేసిన భారత్ పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం చేసింది. పాక్ లోని కీలక నగరాలే టార్గెట్‌గా భారత్ డ్రోన్ల దాడి చేస్తోంది. అయితే, ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌పై విదేశాంగ, రక్షణ శాఖ సంయుక్తంగా ప్రెస్‌మీట్ నిర్వహించి సంచలన విషయాలను వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ గురించి మహిళా అధికారి కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. భారత్‌పై జరిగిన ప్రతి దాడిని తిప్పికొట్టామన్నారు.ఉత్తర, పశ్చిమ భారత్ లోని 15 ప్రాంతాలపై దాడులకు పాక్ యత్నించిందని అయితే వాటిని సమర్థంగా తిప్పికొట్టామన్నారు. పాకిస్తాన్ మిస్సైల్స్‌ పేల్చేశామని వివరించారు. లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేశామన్నారు. పాక్ సంయమనం పాటిస్తూ తమ ఒప్పందాలను గౌరవిస్తేనే తాము కూడా ఉద్రిక్తతలను పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోమని, సరిహద్దుల్లో శాంతిని కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని వ్యాఖ్యానించారు. అయితే, దేశ సార్వభౌమత్వాన్ని, పౌరుల భద్రతను కాపాడుకోవడంలో ఏ మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు..

Related posts

యాదవ్ ల కంచుకోటలో బీహార్ సీఎం నితీశ్ కు పరిక్ష..!

TV4-24X7 News

13 రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్

TV4-24X7 News

ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో బాధ్యతల స్వీకరణ

TV4-24X7 News

Leave a Comment