Tv424x7
Andhrapradesh

అవకతవకలకు పాల్పడిన 140 మంది వైద్య సిబ్బందిని తొలగించిన ఏపీ ప్రభుత్వం

వైద్య ఆరోగ్యశాఖ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.వైద్యులు, సిబ్బందిని విధుల నుంచి తప్పించేయాలని ఆదేశించింది. దాదాపు 140 మంది వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు నమోదులో అవకతవకలకు పాల్పడ్డారని,వారందరికి ఉద్యోగుల నుంచి తొలగించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.పీహెచ్‌సీలు, ఇతర ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బంది ఎఫ్‌ఆర్‌ఎస్‌ (ముఖఆధారిత హాజరు నమోదు)లో అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ‘పట్టణాల్లో నివసించే వైద్యులు, ఇతర సిబ్బంది సకాలంలో ఆసుపత్రులకు చేరుకోవడం లేదు,అయినా నిర్ణీత సమయంలోనే విధులకు వచ్చినట్లు సమయ వేళలను ఐ-ఫోన్‌ సాంకేతికతతో మార్చారు. ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు’ ఈ కారణంతోనే వారందరిని తప్పించాలని ఆదేశించారు.మరోవైపు భారత్‌ పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి తర్వాత,కేంద్రం సూచనల మేరకు అత్యవసర సమయంలో వైద్య సేవలపరంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది.అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించింది. డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ ఆధ్వర్యంలో నడిచే జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు సహా ఇతర సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు డీసీహెచ్‌ సిరి ఓ ప్రకటనలో తెలిపారు. ‘అత్యవసర సమయంలో ఎలా వైద్యాన్ని అందించాలన్న దానిపై ఆసుపత్రుల్లో మాక్‌డ్రిల్‌ నిర్వహించాలి. ఆక్సిజన్‌ సదుపాయాన్ని మెరుగుపరచాలి. జనరేటర్లను సిద్ధంగా ఉంచాలి. అవసరమైతే వాలంటీర్ల సాయం కోరేందుకు వీలుగా జాబితాలు సిద్ధంచేయాలి’ అని వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల అధికారులను సిరి ఆదేశించారు.

Related posts

ఒక్క క్లిక్ తో…మీ బ్యాంకు ఖాతా ఖాళీ

TV4-24X7 News

కేపీజీ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి విద్యాశాఖ అధికారికి విద్యార్ధి సంఘాల పిర్యాదు

TV4-24X7 News

మెడికల్ ఖర్చులకు రూ 10 వేలు ఆర్థిక సాయం చేసిన వాసుపల్లి

TV4-24X7 News

Leave a Comment