Tv424x7
Andhrapradesh

ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి ప్రమాదభీమా ఐదు లక్షల రూపాయల చెక్కు అందచేసిన సీతంరాజు సుధాకర్

విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తానని విశాఖ దక్షిణ నియోజక వర్గ టీడీపి సమన్వయకర్త ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అన్నారు. జనవరి 7 న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జీవీఎంసీ 29 వ వార్డుకు చెందిన పురికిటి నాగేంద్ర అలియాస్ మున్న కుటుంబానికి ప్రమాద భీమా సొమ్ము ఐదు లక్షల రూపాయల చెక్కును సీతంరాజు సుధాకర్ చేతుల మీదుగా అందచేశారు అనంతరం సీతంరాజు సుధాకర్ మాట్లాదుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో కార్యకర్తతోపాటు వారి కుటుందానికి భరోసా, భద్రత లభిస్తుందన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తలకు, నమ్మినవారికి అందగా ఉండే విధంగా, పార్టీ కార్యకర్తలు చనిపోతే వారి కుటుయిం రోడ్డున పడకుండా ఉండేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రమాదబీమా ప్రారంభించారన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ వురికిటి నారాయణరావు,టీడీపీ నాయకులు బత్తిన నవీన్ కుమార్, చొల్లంగి శేఖర్, కండిపల్లి సరీష్ కుమార్ పాల్గొన్నారు.

Related posts

ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు వేతనం ఖరారు…

TV4-24X7 News

మద్యం మత్తులో కానిస్టేబుల్ పై దాడి

TV4-24X7 News

మంత్రి రజిని.. వ్యూహం ఫలించేనా.?

TV4-24X7 News

Leave a Comment