Tv424x7
National

ముగిసిన డీజీఎంఓ ల సమావేశం

భారత్- పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాల ‘సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ (డీజీఎంవో)లు హాట్ లైన్లో చర్చలు నిర్వహించారు. భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి ఇందులో పాల్గొన్నారు. వాస్తవానికి మధ్యాహ్నం 12 గంటలకే చర్చలు జరగాల్సి ఉండగా.. సాయంత్రానికి వాయిదా పడ్డాయి. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు, పీవోకే తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్, పాక్ సైన్యం కవ్వింపులు తదితర పరిణామాలతో ఇటీవల ఇరుదేశాల నడుమ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మే 10న ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.

Related posts

వాజ్ పాయ్ శతజయంతి వేడుకలు సందర్భంగా ఢిల్లీ వెళ్లిన సిఎం చంద్రబాబు – నేడు ఎన్డీయే కూటమి నేతల కీలక భేటీ

TV4-24X7 News

పాక్ సైన్యాధిపతిగా సాహిర్ షంషాద్ మీర్జా?

TV4-24X7 News

ఒక్క రన్ చేయకుండా బుమ్రా అరుదైన రికార్డు

TV4-24X7 News

Leave a Comment