Tv424x7
Andhrapradesh

నిండా నిండిన జూరాల ప్రాజెక్టు.. 12 గేట్లు ఎత్తివేత..!!

ఈసారి ముందస్తుగా రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలో వరద పోటెత్తింది.భారీ వరదలతో జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దీంతో గురువారం (మే 29) మొత్తం 12 గేట్లు ఎత్తేశారు అధికారులు.పైనుంచి వస్తున్న వరదల కారణంగా మహబూబ్ నగర్ లో ఉన్న ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. గేట్లు మొత్తం ఎత్తేయడంతో ప్రాజెక్టు వద్ద ఔట్ ఫ్లో 82 క్యూసెక్కులుగా ఉంది. గేట్లన్నీ ఎత్తేయడంతో 82 వేల క్యూసెక్కుల నీరు దిగువకు శ్రీశైలం వైపు పరవళ్లు తొక్కుతోంది.ఈ సారి వర్షాలు ముందుగానే కురుస్తుండటంతో ప్రాజెక్టు చాలా తొందరగా నిండిందని అధికారులు చెబుతున్నారు. మే నెలలో జూరాల గేట్లు ఎత్తివేయడం ప్రాజెక్టు చరిత్రలోనే ఇది మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు.అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, దాని ఉపనదుల్లో ఎన్నడూ లేనంత వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాలకు ఇన్ ఫ్లో 66 వేల క్యూసెక్కుటు ఉందని అధికారులు తెలిపారు.

Related posts

కక్ష సాధింపు చర్యలు ఎవరు చేయకూడదు : నంద్యాల వరదరాజుల రెడ్డి

TV4-24X7 News

జనవరి 13 నుంచి మహా కుంభమేళా.. ఏర్పాట్లు షురూ

TV4-24X7 News

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా.

TV4-24X7 News

Leave a Comment