Tv424x7
Andhrapradesh

ఉక్కు ప్రైవేటీకరణపై పవన్ క్లారిటీఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

విశాఖ ఉక్కు కర్మాగారం మీద కీలక వ్యాఖ్యలు చేశారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టే కార్యక్రమానికి హాజరైన పవన్ ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు. కేంద్రంలో ఎన్డీయే ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఏపీకి ఎంతో మేలు జరిగింది అని ఆయన చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం కాకుండా నిలబెట్టుకున్నామంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సహకారమే అని పవన్ అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాదు ఇక ఎప్పటికీ కానేరదు అన్నది పవన్ కళ్యాణ్ మాటల అర్ధంగా ఉంది. ఆయన ఇంత స్పష్టంగా విశాఖ ఉక్కు ప్రైవేట్ కోరలలో చిక్కుకోదని బయటపడిందని చెప్పాక ఉక్కు కార్మిక సంఘాలు ఏమి ఆలోచిస్తాయన్నది అంతా తర్కించుకుంటున్నారు. అయితే విశాఖ ఉక్కు కర్మాగారం మీద చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం అని కార్మిక సంఘాలు అంటున్నారు. 2021 జనవరిలో ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించిందని అంటున్నారు. అయితే ఆనాటి నిర్ణయం మీద వెనక్కి తగ్గామని కానీ రద్దు చేసుకున్నామని కానీ కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదని అంటున్నారు. పైపెచ్చు విశాఖ ఉక్కు కర్మాగారంలో తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ కూడా ప్రైవేటీకరణకు ప్రోత్సహించేలా ఉంటున్నాయని చెబుతున్నారు. కార్మికులను తగ్గించడం ద్వారా ఉత్పత్తి తగ్గుతుందని ఎందుకు ఆలోచించరని వారు అంటున్నారు. కేంద్రం అయితే ఈ విషయంలో కచ్చితంగా ప్రకటన చేస్తేనే తప్ప ఉక్కుకి ప్రైవేటు వేటు తప్పింది అనుకోవడానికి లేదు అని అంటున్నారు. విశాఖ ఉక్కుని సెయిల్ లో విలీనం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాదని పవన్ అంటున్నారు. ఆ విధంగా జరిగితే అందరికీ సంతోషమే కానీ కేంద్రం ఎందుకు క్లారిటీ ఇవ్వదు అన్నదే కార్మికుల ఆవేదనగా ఉంది.

Related posts

జగన్ పై రాయి దాడి కేసు..నిందితుడి కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా

TV4-24X7 News

కాగ్‌ అధిపతిగా తెలుగు అధికారి సంజయ్‌మూర్తి ప్రమాణస్వీకారం

TV4-24X7 News

ఎన్నికల్లో అక్రమాల అడ్డుకట్టకు ‘సీ-విజిల్’ యాప్

TV4-24X7 News

Leave a Comment