Tv424x7
Andhrapradesh

గాయత్రి జూనియర్ కాలేజి లో “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం

యువతకు భవిష్యత్తుపై కొత్త ఆశలను రేకెత్తిస్తూ,డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదంతో,నగరంలోని శంకరాపురం గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.వాస్తవ పరిస్థితులను వివరించడం ద్వారా విద్యార్థులకు డ్రగ్స్ వలన కలిగే అనర్థాలను కళ్ళకు కట్టినట్లు వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ కట్టడికి ఏర్పాటు చేసిన ‘ఈగల్'(ఈగల్ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్.లా.ఎన్ఫోర్స్మెంట్).టాస్క్ ఫోర్స్ గురించి అధికారులు వివరించారు.ఈగల్ బృందాలు డ్రగ్స్ అక్రమ రవాణా,విక్రయాలపై ఎలా నిఘా ఉంచుతాయో తెలిపారు.అంతేకాకుండా,ఎన్ డి పి ఎస్.చట్టంలోని కఠిన శిక్షలు గురించి స్పష్టంగా వివరించారు. డ్రగ్స్ దందాకు పాల్పడిన వారికి ఎలాంటి జైలు శిక్షలు, జరిమానాలు ఎదురవుతాయో తెలిపారు.ప్రజలు భాగస్వాములు కావాలి:”ప్రతి పౌరుడూ డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో ఒక సైనికుడే” అని వారు పేర్కొన్నారు.మీ చుట్టుపక్కల ఎక్కడైనా గంజాయి లేదా ఇతర డ్రగ్స్ విక్రయాలు,వినియోగం జరుగుతున్నట్లు గమనిస్తే,వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని సూచించారు.మీ సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో,కళాశాలఅధ్యాపకులు,నార్కో టిక్.సెల్.నుండిమల్లయ్య,ఈగల్ టీం నుండి అయూబ్ ఖాన్,గురు శేఖర్ పాల్గొన్నారు.విద్యార్థులు, అధ్యాపకులు డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయడానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Related posts

ఎం ఆర్ పేట పోలీసుల విజిబుల్ పోలిసింగ్

TV4-24X7 News

దేశం అభివృద్ది పథంలో దూసుకుపోతుంది.. రాష్ట్రపతి ముర్ము

TV4-24X7 News

వ్యక్తిని కాపాడిన వన్ టౌన్ పోలీసులు

TV4-24X7 News

Leave a Comment