సిటిజన్ టైమ్స్ అమరావతి:సెప్టెంబర్ 02
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతు న్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లు ట్విటర్ వేదికగా పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా పవన్ కల్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మిత్రులు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హృదయపూ ర్వక జన్మదిన శుభాకాం క్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం.. అణువణువునా సామాజిక స్పృహ.. మాటల్లో పదు ను.. చేతల్లో చేవ.. జన సైన్యానికి ధైర్యం..
మాటకి కట్టుబడే తత్వం.. రాజకీయాల్లో విలువలకు పట్టం.. స్పందించే హృదయం.. అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి. మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్దిలో మీ సహకారం మరువ లేనిది అని తెలియజేస్తూ.. వైకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అంటూ చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి నారా లోకేశ్ పవన్ కల్యాణ్‌కు ట్విటర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.