మైలవరం మండలం లోని దొమ్మరనంద్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్య పదజాలంతో దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలపై, ఆయనపై సమగ్ర విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్ చేశారు.
బుధవారం రోజున DYFI ఆధ్వర్యంలో మండల విద్యా శాఖ అధికారులు చిట్టిబాబు, శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.