Tv424x7
Andhrapradesh

మార్కాపురం ఇరిగేషన్ కార్యాలయంలో అవినీతి చేప

మార్కాపురం ఇరిగేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు ఒక కాంట్రాక్టర్ నుండి 30 వేల రూపాయిలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ ఒంగోలు డీఎస్పీ ఎస్ శిరీష మీడియాకు వివరించారు. శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టర్ మూడు అభివృద్ధి పనులు చేశారు. పెండింగ్ బిల్లులు అప్రూవల్ చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ 30 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దాంతో కాంట్రాక్టర్ నుండి 30 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పథకం ప్రకారం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావును ఏసీబీ డిఎస్పీ శిరీష వలపన్ని పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు రమేష్ బాబు, శేషు,సబ్-ఇన్స్పెక్టర్లు ప్రసాద్, మస్తాన్ షరీఫ్, సిబ్బంది పాల్గొన్నారు..

Related posts

ఈనెల 9న చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం: హాజరుకానున్న నరేంద్ర మోడీ?

TV4-24X7 News

ఏపీలో సర్పంచ్, MPTC ఎన్నికలు, కీలక అప్డేట్

TV4-24X7 News

ఏపీలో త్వరలో ఎస్సీలకు రూ.50,000 రాయితీతో రుణాలు

TV4-24X7 News

Leave a Comment