- ఆయుష్మాన్ భారత్ – ఎన్టీఆర్ సేవా పథకం
రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది.
ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించనున్నారు.
ఇది రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు వర్తిస్తుంది.
ఆరోగ్య బీమా పాలసీగా దీని అమలు చేయనున్నారు.
🔹 2. కొత్త మెడికల్ కళాశాలలు
పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) మోడల్‌లో రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కళాశాలలు స్థాపించడానికి ఆమోదం.
వైద్య విద్యా వృద్ధికి ఇది ఎంతో ఉపయుక్తం కానుంది.
🔹 3. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలు
ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలుసవరణలు కేబినెట్ ఆమోదించిందని సమాచారం.
వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.