Tv424x7
National

సల్మాన్ ఖాన్ విమర్శలు చేసింది ట్రంప్ ను ఉద్దేశించేనా?

బిగ్‌బాస్ షోలో సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.

శాంతి బహుమతి కోరుకునే వారిపై పరోక్ష విమర్శలు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను టార్గెట్ చేశారంటూ జోరుగా చర్చ.

సమస్యలు సృష్టించేవారే శాంతి బహుమతి కోరుకుంటారని వ్యాఖ్య.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సల్మాన్ వీడియో.

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ వేదికగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆయన పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలతో ఎంటర్‌టైన్‌మెంట్ షోలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.

బిగ్‌బాస్ 19వ సీజన్ వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ సల్మాన్ ఖాన్, హౌస్‌మేట్స్‌ మధ్య జరుగుతున్న గొడవలపై చర్చిస్తున్నారు. ఇంట్లో గొడవలకు కారణమవుతూనే, తామే శాంతి దూతలుగా చెప్పుకుంటున్న కొందరు కంటెస్టెంట్‌లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో, “ప్రపంచంలో ఏం జరుగుతోందో చూడండి. సమస్యలను సృష్టించే వారే ఇప్పుడు శాంతి బహుమతి కావాలని అడుగుతున్నారు” అని సల్మాన్ వ్యాఖ్యానించారు.

సల్మాన్ ఖాన్ ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినా, ఈ వ్యాఖ్యలు నేరుగా డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించినవేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాను భారత్-పాకిస్థాన్ సహా అనేక యుద్ధాలను ఆపానని, అందుకే తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ట్రంప్ గత కొంతకాలంగా బహిరంగంగా కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను పలువురు నెటిజన్లు “బిగ్‌బాస్‌లో ట్రంప్‌పై సల్మాన్ విమర్శలు” అనే క్యాప్షన్‌తో షేర్ చేస్తున్నారు. సల్మాన్ చాలా ధైర్యంగా తన అభిప్రాయాన్ని చెప్పారని కొందరు ప్రశంసిస్తుండగా, దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఒక సాధారణ రియాలిటీ షోలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Related posts

ఉక్కు మనిషి’కి రాష్ట్రపతి నివాళులు..!!

TV4-24X7 News

పాక్ అమ్మాయి, భారత్ అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి

TV4-24X7 News

IBPS నుండి గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

TV4-24X7 News

Leave a Comment