, జనవరి 7న జరిగే గిరిజన శంఖారావం గోడపత్రికలను ఆవిష్కరించిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డివెనుకబడిన గిరిజన జాతి వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేస్తానని వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షుడు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంపాల్ రెడ్డి అన్నారు.శుక్రవారం కర్నూలు నగరంలోని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి నివాసంలో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో జనవరి 7వ తేదీన జరిగే గిరిజన శంఖారావం గోడపత్రికల, బంజారా ధర్మసేన రాష్ట్ర అధ్యక్షులు రాజారాం నాయక్, గుడంబాయ్ తాండ సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, జిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, జిల్లా అధ్యక్షుడు జయరాం నాయక్ లు కలిసి గోడపత్రికలను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంపాల్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనులు ఐక్యమత్యంతో ఉంటే మరింత అభివృద్ధి చెందుతారని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకుని సమస్యలను పరిష్కారం దిశగా కృషి చేస్తున్నానన్నారు. రేపు జరిగే గిరిజన శంఖారావం కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ మాట్లాడుతూజనవరి 7న జరిగే గిరిజన శంఖారావం భారీ బహిరంగ సభకు కుటుంబ సభ్యులతో తరలివచ్చి జయప్రదం చేయాలని గిరిజనులకు పిలుపునిచ్చారు. అందరూ సంకటితమై ఐక్యమత్యంతో కదిలి వచ్చి గిరిజన జాతి చాటాలన్నారు.
