గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పట్టుదల, ఆత్మ విశ్వాసంతోపాటు సాధించాలనే తపనతో అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖ కమిషనర్ వి. రామకృష్ణ అన్నారు. హరప్పన్ సివిల్ సొసైటీ సహకారంతో పూలే అంబేడ్కర్ విజ్ఙాన కేంద్రం చారిటబుల్ ట్రస్ట్, కేవీపీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్ 1 శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు శనివారం పుస్తకాల బహూకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు పట్టుదలతో విజయం సాధించాలనే తపనతో చదవాలని సూచించారు . తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ పుస్తకాలతో పాటు ప్రస్తుత వార్త పత్రికల్లోని ఎడిటోరియల్ తప్పక చదవాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టరు డి.శ్రీనివాసన్ మాట్లాడుతూ స్టడీ సర్కిల్స్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. జీఆర్‌కే పోలవరపు సాంస్కృతిక కళా సమితి అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఉండాలన్నారు. కార్యక్రమంలో ఫూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, బిళ్లా సంజీవయ్య, కంచర్ల అంబేద్కర్, సిద్ధార్థ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మన్నం రాజారావు , జి. నటరాజు, కండెల్లి సురేంద్ర, లంకపల్లి రజీనీష్ బాబు, నాగరాజు, నారాయణరెడ్డి , అంకమ్మరాజు, మాన్వషిణి తదితరులు పాల్గొన్నారు.

previous post
next post