రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన వేడుకలు మున్సిపల్ చైర్మన్ శ్రీ మాచనూరు చంద్ర గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించబడినది ఈ కార్యక్రమాన్ని కేక్ కటింగ్ తో ప్రారంభించి, పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నటువంటి ఆడపడుచులకు చీరలు పంపిణీ చేయడం జరిగినది మరియు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటడం జరిగినది *ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ శ్రీ మాచనూరు చంద్ర గారు మాట్లాడుతూ జననేత జగన్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మైదుకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి 67 కోట్లు మంజూరు చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడినందుకు మరోసారి మీడియా మిత్రుల ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను తెలియజేశారు* ఈ కార్యక్రమంలో మైదుకూరు మున్సిపల్ మున్సిపల్ కమీషనర్ రంగస్వామి గారు వార్డ్ కౌన్సిలర్లు/ఇన్చార్జిలు A.C.K. రమణ, వెంకటేష్, సురేష్, భరత్ రఘురామయ్య , భూమిరెడ్డి సుబ్బరాయుడు, జమాల్ ,గౌస్, మాచనూరు సుబ్బరాయుడు , సుబ్బారావు, మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

previous post