సమరసింహ రెడ్డి తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన సినిమాల్లో ఒకటి. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ కెరీర్‌కు భారీ మైలురాయిగా నిలిచింది. అయితే ఈ కథ మొదట మరో స్టార్ హీరో వద్దకు వెళ్లిందనే విషయం సినీ వర్గాల్లో ఎప్పటినుంచో చర్చనీయాంశంగా ఉంది.సినీ వర్గాల సమాచారం ప్రకారం, దర్శకుడు బి . గోపాల్ ఈ కథను వెంకటేష్ద గ్గుబాటి కు వినిపించినట్లు చెబుతారు. కథ నచ్చినా, అప్పటి తన ఇమేజ్‌కు ఫ్యాక్షన్, హింసాత్మక అంశాలు ఎక్కువగా ఉండటం సరిపోతుందా అనే ఆలోచనతో వెంకటేష్ ఈ ప్రాజెక్ట్‌పై ముందుకు వెళ్లలేదని ప్రచారం ఉంది.ఆ తర్వాత కథ బాలకృష్ణ వద్దకు చేరగా, ఆయన వెంటనే అంగీకరించినట్లు చెబుతారు. 1999 సంక్రాంతికి విడుదలైన సమరసింహారెడ్డి భారీ విజయాన్ని అందుకుని, ఫ్యాక్షన్ సినిమాలకు కొత్త ట్రెండ్ సెట్ చేసింది. సినిమాలో హీరోయిన్లుగా సిమ్రాన్ , అంజల జవేరి , సంఘావి నటించారు.అయితే, వెంకటేష్ నిజంగా ఈ కథను తిరస్కరించారా? లేదా బాలయ్య పేరును సూచించారా? అనే విషయంపై అధికారిక ధృవీకరణ లేదు. ఇది ప్రధానంగా సినీ వర్గాల్లో వినిపించే కథనంగా మాత్రమే ప్రచారంలో ఉంది.
previous post

