బండి భగీరథ్ పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. కేసు విచారణలో భాగంగా భగీరథ్‌కు సన్నిహితంగా ఉన్న స్నేహితుల వాంగ్మూలాలు కీలకంగా మారినట్లు తెలుస్తోంది.బాధితురాలి తల్లి ఫిర్యాదులో ప్రస్తావించిన సంఘటనల సమయంలో భగీరథ్‌తో ఉన్న వ్యక్తుల వివరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ముగ్గురు యువతులు సహా దాదాపు 10 మంది స్నేహితుల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సమాచారం.సోమవారం ఇద్దరు యువకులు, ఒక యువతిని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి సుమారు రెండు గంటల పాటు విచారించినట్లు తెలిసింది. వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసి, కేసులో ఉన్న అంశాలపై వివరాలు సేకరించినట్లు సమాచారం.ఇక నిందితుడు భగీరథ్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దర్యాప్తు బృందం నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, సోషల్ మీడియా డేటా సేకరణపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఖాతాల్లోని డేటాను రిట్రీవ్ చేసి, కేసుకు సంబంధించిన ఆధారాలను పరిశీలించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.అయితే, కేసుపై అధికారికంగా పోలీసులు వెల్లడించే వివరాలు మరియు కోర్టు విచారణలో తేలే అంశాలే తుది నిర్ణయాత్మకంగా పరిగణించబడతాయి.
previous post

