*ఆంధ్రప్రదేశ్:- మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏపీలో అమలుకు రంగం సిద్దమవుతోంది. ఈ పథకం అమలు పైన ఆర్దిక భారం..పొరుగు రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలపైన ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వరుస సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఎన్నికల్లోకి వెళ్తున్న అధికార వైసీపీ ఈ నిర్ణయం పైన ఆచితూచి అడుగులు వేస్తోంది. మహిళలకు ఈ పథకం అమలు చేస్తూనే..ఇతర వర్గాలకు అసౌకర్యం లేకుండా విధి విధానాలు ఖరారు చేస్తోంది.

next post