Tv424x7
Andhrapradesh

ప్రజలకు ఏదీ ఫ్రీగా ఇవ్వొద్దు… ఇవి తప్ప…

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదని భారత ప్రజలకు అన్నీ ఉచితంగా ఇచ్చే బదులు.. వారికి నిత్యావసరాలైన విద్య, వైద్యం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలి అన్నారు.అలాగే ఇంగ్లీష్ నేర్చుకోండి కానీ, తెలుగుని మర్చిపోవద్దు అన్నారు. ప్రతి మనిషి, ప్రతి రోజు తెలుగులో మాట్లాడితే బాగుంటుందని, ప్రతి వ్యక్తికి మొదటి మన దైవం కన్న తల్లిదండ్రులే అనేది గుర్తించాలన్నారు. మాతృభాషను మొదట చదువుకోని ఆర్వాత ఇంగ్లీష్ భాషపై మక్కువ పెంచుకోవాలన్నారు. ఇక ఏ ప్రభుత్వాలు అయినా సరే పోటాపోటీగా ఉచితాలు ఇవ్వడం మంచి పద్దతి కాదన్నారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలని సూచించారు. మనం పోయిన తర్వాత మనల్ని నలుగురు గుర్తుంచుకోవాలి అంటే కచ్చితంగా మంచి పనులు చేయాలన్నారు. శారీరకంగా దృడంగా ఉంటేనే, మానసికంగా ధృఢంగా ఉంటామని, అందుకే ప్రతిరోజూ యోగ చేయడం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.ఇటీవల యువత ఫాస్ట్‌ఫుడ్‌ కల్చర్‎కి బాగా అలవాటు పడుతున్నారని, అది ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని వెంకయ్యనాయుడు హెచ్చరించారు.

Related posts

తమిళనాడులో మొదలైన జల్లికట్టు సందడి

TV4-24X7 News

నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన వ్యవహారంపై ఈసీ సీరియస్

TV4-24X7 News

ఈ నెల 13న అనంతకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… ?

TV4-24X7 News

Leave a Comment