Tv424x7
Andhrapradesh

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయిని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు..

చిత్తూరు జిల్లా, వి.కోట.బుధవారం ఉదయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం పర్యటనకు వి.కోట మీదుగా వెళుతుండగా విషయం తెలుసుకున్న నీటి ట్యాంకర్ల యజమానులు అంబేద్కర్ కూడలి వద్ద కాన్వాయ్ కి అడ్డంగా నిలబడ్డారు..మంత్రి ప్రయాణిస్తున్న కారును అడ్డగించేందుకు వెళ్లిన వైసిపి నేతలను పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా వారిని పక్కకు తోసిపడేసి తమ బాధను ఆయనకు విన్నవించాల్సిందని పట్టు పట్టారు..ఈ లోపు మంత్రి వాహనం నుంచి దిగిన వైసీపీ నేతలు వారందరినీ బుజ్జగించే ప్రయత్నం చేసినా వారు అసహనాన్ని వ్యక్తం చేశారు..తమ బాధను ఇక్కడున్న నేతలకు చెప్పుకుంటే ఫలితం లేదని.. ఇబ్బందని మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని వాహనాన్ని ఆపాల్సిందే అంటూ అడ్డుకున్న సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు…గత నాలుగున్నర సంవత్సరాల నుంచి తమ రావాల్సిన నీటి బిల్లులను చెల్లించలేదని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు…సుమారు రూ.20 కోట్ల మేరకు పలమనేరు నియోజకవర్గం లోని పలు మండలాలకు నీటి బిల్లులను గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. పలువురు మంత్రి దృష్టికి నీటి బిల్లుల వ్యవహారాన్ని తీసుకెళ్లగా.. పూర్తి వివరాలు తనకు అందజేయాలని తక్షణం బిల్లులు వచ్చేలా చూస్తానని మంత్రి వారికి నచ్చచెప్పి కుప్పం పయనమయ్యారు..

Related posts

తొలి దళిత ముఖ్యమంత్రివర్యులు దామోదర్ సంజీవయ్య 103వ జయంతి

TV4-24X7 News

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: ఈసీ నీలం సాహ్ని

TV4-24X7 News

గంజాయి కేసులలో ఇద్ధరు నిందితులను అరెస్ట్

TV4-24X7 News

Leave a Comment