ప్రభుత్వోద్యోగి తన సర్వీస్ రికార్డుల కోసం సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంటుందా ? సమాచార హక్కు చట్టం , 2005 లోని సెక్షన్ 3 ప్రకారం ఈ చట్టంలోని నిబంధనలకు లోబడి , సమాచారాన్ని పొందే హక్కు అందరి ప్రజలకు ఉంది . ప్రభుత్వోద్యోగి కచ్చితంగా ఓ పౌరుడే . అందువల్ల సంబంధిత అధికారి నుంచి సమాచారాన్ని కోరే హక్కు ప్రభుత్వోద్యోగికి కూడా ఇతరుల మాదిరిగానే సమానంగా ఉంది . సమాచారాన్ని పొందే హక్కు ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది . ఈ నేపథ్యంలో సమాచార హక్కు ప్రాధాన్యతకు గుర్తింపు లభించింది . కాబట్టి కేవలం ఆ హక్కును పొందేందుకు అవసరమైన విధానాన్ని చూపించేందుకే సమాచార హక్కు చట్టాన్ని ఆమోదించారు . ప్రభుత్వోద్యోగికి కూడా సమాచారాన్ని పొందేందుకు సమాన హక్కులు ఉన్నాయి . సమాచార హక్కు ప్రాథమిక హక్కు అయినందువల్ల ప్రభుత్వోద్యోగి తనపై అధికారి నుంచి సమాచారాన్ని పొందటానికి సమాచార హక్కు దరఖాస్తు చేయవచ్చు . ఈ చట్టంలోని సెక్షన్ 6 క్రింది విధంగా చెస్తోంది . సెక్షన్ 6 నిబంధనలనుబట్టి తెలిసేది ఏమిటంటే , సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారాన్ని పొందాలంటే సంబంధిత అథారిటీ యొక్క కేంద్ర ప్రజా సమాచార అధికారికి లేదా రాష్ట్ర ప్రజా సమాచార అధికారికి దరఖాస్తు చేయాలి . ప్రభుత్వోద్యోగి కోరిన తరహా సమాచారాన్ని అందజేయడానికి డిపార్ట్మెంట్ లో అటువంటి అధికారిగా నియమితుడైనవారిని సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారాన్ని కోరేందుకు సంప్రదించవలసి ఉంటుంది .అంతేకానీ ప్రభుత్వోద్యోగి తన కార్యాలయ అధిపతి ద్వారా సమాచార హక్కు దరఖాస్తును పంపించాలని తెలిపే నిబంధన ఏదీ లేదు . ” 6. సమాచారం పొందడానికి అభ్యర్ధన . – ( 1 ) ఈ చట్టం సమాచారాన్ని పొందాలని కోరుకునే ఏ వ్యక్తి అయినా క్రింద పేర్కొన్నవారికి ఇంగ్లిష్ లేదా హిందీ లేదా సదరు దరఖాస్తు ఏ ప్రాంతం నుంచి చేస్తున్నారో .. ఆ ప్రాంతంలో అధికారిక భాషలో లిఖితపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా విజ్ఞప్తి చేయాలి . సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు నేరుగా ఆర్టీఐ దరఖాస్తు చేయడానికి ఈ నిబంధన అనుమతిస్తుంది . ప్రభుత్వోద్యోగి తన కార్యాలయ అధిపతి ద్వారా ఆర్టీఐ దరఖాస్తును పంపించవలసిన అవసరం లేదు . అంతేకాకుండా వ్యక్తిగతంగా సంప్రదించేందుకు అవసరమైన వివరాలను మాత్రమే తెలియజేయవలసి ఉంటుందని , సమాచారాన్ని ఎందుకు కోరుతున్నదీ తెలియజేయవలసిన అవసరం లేదని సెక్షన్ 6 ( 2 ) చెస్తోంది . ఓ ప్రభుత్వోద్యోగి ఆర్టీఐ దరఖాస్తు చేసినపుడు తాను ప్రభుత్వోద్యోగినని పేర్కొనవలసిన అవసరం లేదు . ఆ ఉద్యోగి తన హోదాను తెలియజేయాలని కోరుకుంటే తెలియజేయవచ్చు . అయితే ప్రభుత్వోద్యోగి తన సర్వీస్ రికార్డులకు సంబంధించిన సమాచారాన్ని కోరుతున్నపుడు , ఆ సమాచారాన్ని విశ్వాసబద్ధ , ధర్మకర్తృత్వ విధానంలో నిర్వహిస్తున్నట్లయితే , ఆ దరఖాస్తుదారైన ఉద్యోగి తన హోదాను తెలియజేయాలని సలహా ఇవ్వవచ్చు . ఎందుకంటే , ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8 ( 1 ) ( ఈ ) ప్రకారం సమాచారాన్ని మినహాయించవచ్చు . ఈ సెక్షన్ వర్తింపజేయకుండా ఉండటానికి దరఖాస్తుదారు తాను ప్రభుత్వో ద్యోగినని చెప్పవచ్చు . తనకు కావలసినది తన రికార్డినని చెప్పవచ్చు . ( ఏ ) సంబంధిత పబ్లిక్ అథారిటీ యొక్క కేంద్ర ప్రజా సమాచార అధికారికి లేదా రాష్ట్ర ప్రజా సమాచార అధికారికి , సందర్భాన్ని బట్టి ఎవరైతే వారికి ; ( బి ) సందర్భాన్నిబట్టి , సంబంధిత కేంద్ర సహాయ ప్రజా సమాచార అధికారికి లేదా రాష్ట్ర సహాయ ప్రజా సమాచార అధికారికి ; సదరు దరఖాస్తుదారు కోరుతున్న సమాచారం యొక్క వివరాలను తెలియజేస్తూ దరఖాస్తు చేయాలి . అయితే , సదరు విజ్ఞప్తిని లిఖితపూర్వకంగా చేయలేనపుడు , సదరు దరఖాస్తుదారు మౌఖికంగా తెలియజేస్తే , దానిని లిఖితపూర్వకంగా రాయడానికి కేంద్ర ప్రజా సమాచార అధికారి లేదా రాష్ట్ర ప్రజా సమాచార అధికారి , సందర్భాన్నిబట్టి ఎవరైతే వారు , సమంజసమైన పైన చెప్పినది ఏదైనప్పటికీ , ప్రభుత్వోద్యోగి కోరుకుంటే , ఆర్టీఐ దరఖాస్తుకు బదులుగా , మొదట సాధారణంగా తన అధికారులను ఈ విధంగా కోరడం చట్ట ప్రకారం అవసరం లేదు . రెండో విషయం తనకు కావాల్సిన సమాచారం ఇవ్వాలని కోరవచ్చు . అయితే ఏమిటంటే , ప్రభుత్వోద్యోగి నేరుగా ఆర్టీఐ దరఖాస్తును చేయాలను కుంటే , దాని నకలును తాను కోరుకుంటే తన కార్యాలయపు అధిపతికి పంపించవచ్చు . కేవలం సమాచారం కోసం ఈవిధంగా పంపించవ కేవలం సీనియర్లను గౌరవించేందుకు మాత్రమే ఈ విధంగా సమాచారాన్ని తెలియజేయవచ్చు . ప్రభుత్వోద్యోగి తనకు కావలసిన సమాచారాన్ని కోరుతూ నేరుగా సంబంధిత ప్రజా సమాచారం . రీతిలో సహాయపడతారు . అయితే ఇది కూడా చట్ట ప్రకారం అవసరం లేదు . ( 2 ) సమాచారం కోసం దరఖాస్తు చేసే వ్యక్తి తాను ఆ సమా చారాన్ని ఎందుకు కోరుతున్నదీ తెలియజేయనక్కర్లేదు . అదేవిధంగా సదరు దరఖాస్తుదారును ఏ విధంగా సంప్రదించాలో తెలియజేసే సమాచారం మినహా ఇతర వ్యక్తిగత వివరాలను తెలియ చేయనక్కర్లేదు . అధికారికి దరఖాస్తు చేయవచ్చు
సేకరణ :- నారుపల్లి శివదస్తగిరి రెడ్డి (8686186039)