ఏపీ సీఎం జగన్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా సహా కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆయన కలవనున్నారని సమాచారం.ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం సహా పలు అంశాలపై చర్చించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారింది.

previous post