కడప /ఫిబ్రవరి 2: జిల్లా అదనపు ఎస్.పి (అడ్మిన్) గా లోసారి సుధాకర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. లోసారి సుధాకర్ 1995 బ్యాచ్ లో ఎస్.ఐ గా ఎంపికై జిల్లాలోని బ్రహ్మంగారి మఠం, కమలాపురం, ముద్దనూరు, సి.కె దిన్నె పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. సి.ఐ గా పదోన్నతి పొందిన అనంతరం లక్కిరెడ్డిపల్లె, మహిళా పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వర్తించారు. డి.ఎస్.పి గా ఎస్.సి ఎస్.టి సెల్, ప్రొద్దుటూరు , ఏ.సి.బి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో పనిచేశారు. ప్రస్తుతం చిత్తూర్ అదనపు ఎస్.పి (అడ్మిన్) గా పని చేస్తూ బదిలీపై జిల్లాకు వచ్చారు.

previous post