కడప/మైదుకూరు:దువ్వూరు ఎసై ఎస్.శ్రీనివాసులు వారి సిబ్బంది సోమవారం సాయంత్రం దువ్వూరు మండలంలోని ఇడమడక బార్డర్ చెక్ పోస్ట్ నందు వాహనాలను తనిఖీ చేస్తూండగా బెంగుళూరుకు చెందిన జె.యస్.జయ ప్రకాష్ అను వ్యక్తి KA01 MQ 4009 నెంబర్ గల కారులో వనపర్తి నుండి కుప్పంకు వెళ్తుండగా ఇడమడక చెక్ పోస్ట్ నందు కారును ఆపి తనిఖి చేయడంతో సదరు కారు డిక్కీలోని బ్యాగులో మొత్తం 15,00,000/- (పదిహేను లక్షల రూపాయలు ) ఉండినవి. సదరు డబ్బుకు సంబందించిన సరైన ఆధారాలు చూపించమని అడుగగా అందుకు అతను సరైన సమాచారం, పత్రాలు చూపించలేదు, కావున ఈ విదంగా సరైన పత్రాలు, రుజువులు లేకుండా ఇంత మొత్తంలో డబ్బులు తీసుకొని వెళ్ళకూడదు అని వారికి తెలిపి తదుపరి చర్య నిమిత్తం వారి బ్యాగులో ఉన్న మొత్తం 15,00,000/- రూపాయలను, పోలీస్ ప్రొసీడింగ్స్ ద్వారా స్వాదీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం ఇన్కమ్ టాక్స్ వారికి అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ అక్రమంగా తరలిస్తున్న డబ్బులు పట్టుకొనుటకు కృషిచేసిన మైదుకూరు రూరల్ ఇన్స్పెక్టర్ ని, దువ్వూరు సబ్-ఇన్స్పెక్టర్ ని మరియు సిబ్బందిని ప్రశంసించినారు.

previous post
next post