Tv424x7
Andhrapradesh

జనంలోకి పవన్.. యాక్షన్ ప్లాన్ ఇదే.. కానీ ఇంతలోపే వైసీపీ ఇలా చేసిందే..?

AP Politics: అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా రెండు పార్టీల్లోని అగ్ర నేతలు కసరత్తు చేస్తున్నారు..దీనిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపీ వ్యాప్తంగా వరుస ప్రచారాలతో దూసుకెళ్లనున్నారు. ఈ మేరకు పార్టీ హై కమాండ్ ప్రణాళికలను సిద్ధం చేసింది. రేపు(బుధవారం) నుంచి పవన్ కళ్యాణ్ప ఏపీలో పర్యటించనున్నారు. నాలుగు రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు. రేపు(బుధవారం) భీమవరం హెలికాప్టర్‌లో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. హెలిపాడ్ కోసం అనుమతి లేకుండా ప్రభుత్వ పెద్దలు అడ్డుకున్నట్లు సమాచారం. భీమవరం విష్ణు కాలేజీలోని హెలిపాడ్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కి జనసేన నేతలు దరఖాస్తు చేశారు..పవన్ హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం భీమవరం విష్ణు కాలేజీలోని హెలిపాడ్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు జనసేన నేతలు దరఖాస్తు చేశారు. హెలిపాడ్ పరిశీలనలో భాగంగా పోలీసు శాఖ, కలెక్టర్‌లు సానుకూలంగా స్పందించారు. అయితే ఆర్అండ్‌బీ శాఖ ఆంక్షల పేరుతో అడ్డుకుంటుంది. ఆర్‌అండ్‌ బీ శాఖ అధికారి మాత్రం వింత వాదనను తెరమీదకు తీసుకొచ్చాడు. దూరంగా ఉన్న భవనాలను సాకుగా చూపించి అనుమతిని నిరాకరిస్తున్నారు. మరెక్కడో ఉన్న టవర్‌ను అధికారులు చూపిస్తున్నారు. ఆర్ అండ్‌ బీ అధికారులపై వైసీపీ నేతలు ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. గతంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పవన్ కల్యాణ్ హెలీపాడ్‌లో దిగారు. అప్పటికీ ఇప్పటికీ హెలీపాడ్ ప్రాంగణంలో ఎలాంటి మార్పులు ఏమి లేవని జనసేన నేతలు చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే పవన్ టూర్‌కు ఆటంకాలు కలిగిస్తున్నారంటూ జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Related posts

కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి

TV4-24X7 News

నాగబాబుకు మంత్రి పదవి లేనట్టేనా?

TV4-24X7 News

లిక్కర్ కేసులో అప్రూవర్ అయ్యేందుకు వి.సా.రెడ్డికి చాన్స్ !

TV4-24X7 News

Leave a Comment