,రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పరిధి సమీపంలో యువకుడు దారుణ హత్య జరిగిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్యకు గురైన యువకుడు పూడూరు మండలం చన్గోముల్ పోలీసు స్టేషన్ పరిధి మన్నేగూడకు చెందిన సంజీవ్ కుమార్ అనే వ్యక్తిగా గుర్తించారు. జరిగిన ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.