ప్రతి ఇంటికీ చేరిన ప్రభుత్వ ఫలాలు: ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
ప్రొద్దుటూరు – TV424x7: కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రతి ఇంటికీ చేరాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు.
“రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం డోర్ టు డోర్” కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామపంచాయతీ భగత్‌సింగ్ కాలనీ బూత్ నెం.224లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిశీలకులు కొండవీటి భావన మాట్లాడుతూ, ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్. ముక్తియార్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసులరెడ్డి, టీడీపీ కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబివుల్లా, బీజేపీ జిల్లా కార్యదర్శి కోనేటి ప్రదీప్, జనసేన నాయకులు మంచి శివకుమార్, జిలాన్, కామిశెట్టి బాబు, రిటైర్డ్ ఎస్‌ఐ శంకర్‌తో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొ
న్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: