ప్రొద్దుటూరు, జూలై 28 (స్థానిక ప్రతినిధి): కడప జిల్లా ఎస్పీ నచికేత్, ఐపీఎస్, ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ, ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెన్నా నగర్‌లో ఈగల్ టీం ఆధ్వర్యంలో గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ కొండారెడ్డి మాట్లాడుతూ, గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, సరఫరా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ పరిసరాల్లో ఇటువంటి కార్యకలాపాలు గమనించిన వెంటనే 1972, డయల్-100, 112 లేదా ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.
సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు, తగిన ప్రోత్సాహం కూడా అందజేస్తామని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: