కలర్ పాపడ్ తింటున్నారా? జాగ్రత్త..!

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కృత్రిమ రంగులు (సింథటిక్ కలర్స్) కలిపి తయారు చేసే పాపడాలపై తమిళనాడు ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది. ఈ పాపడాల వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు.

అధికారుల ప్రకారం, సింథటిక్ రంగులు కలిగిన పాపడాలు జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు కిడ్నీ సంబంధిత సమస్యలకు దారితీయవచ్చని తెలిపారు. దీర్ఘకాలంగా వీటిని తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

అంతేకాకుండా, పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD) వచ్చే ప్రమాదం కూడా ఉండొచ్చని పేర్కొన్నారు. అందువల్ల వినియోగదారులు కృత్రిమ రంగులు కలిగిన పాపడాల కంటే సహజ పదార్థాలతో తయారైన ఉత్పత్తులను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *