గుంతల రోడ్డుతో నిత్యం నరకయాతన.. అధికారుల స్పందన ఎక్కడ?

రోడ్డు దుస్థితితో ప్రజల ఆవేదన.. పట్టించుకోవాలంటూ విజ్ఞప్తి

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

మైదుకూరు, జూలై 30: కడప జిల్లా దువ్వూరు మండల పరిధిలోని మానేరాంపల్లి నుంచి పెద్ద సింగణపల్లి, మాదిరేపల్లి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎక్కడ చూసినా గుంతలు, దెబ్బతిన్న రహదారితో వాహనదారులు, రైతులు, విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు సైతం సకాలంలో చేరడం కష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

“ప్రభుత్వాలు మారుతున్నాయి… కానీ మా రోడ్డు పరిస్థితి మాత్రం మారడం లేదు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదు” అని గ్రామస్థులు వాపోతున్నారు.

ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి, శాశ్వత పరిష్కారం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *