హమీర్పూర్ (ఉత్తరప్రదేశ్): బీమా సొమ్ము కోసం భార్యను దారుణంగా హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో వెలుగుచూసింది.మృతురాలు రీతా పేరుతో రెండు నెలల క్రితం రూ.44 లక్షల జీవిత బీమా పాలసీ తీసుకున్న భర్త అమర్ సింగ్, తొలి ప్రీమియంగా రూ.2.60 లక్షలు చెల్లించాడు. అనంతరం ముగ్గురు సహచరులతో కలిసి రీతాను కర్రలు, దుడ్డుతో తీవ్రంగా కొట్టి హత్య చేసి, తర్వాత శవంపై కారును నడిపించి రోడ్డు ప్రమాదంలా కనిపించేలా చేశాడు.అనంతరం భార్య కనిపించడం లేదంటూ అమర్ సింగ్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే విచారణలో అనుమానాలు తలెత్తడంతో పోలీసులు కఠినంగా ప్రశ్నించగా నేరాన్ని ఒప్పుకున్నాడు.రీతా మృతదేహం హమీర్‌పూర్‌లోని లాల్పురా ప్రాంతంలోని బైఠ్కా ధామ్ ఆలయం సమీపంలో లభించింది. పోస్టుమార్టం నివేదికలో శరీరంపై 12కిపైగా గాయాలు ఉన్నట్లు, మూత్రపిండాలు మినహా అంతర్గత అవయవాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వెల్లడైంది.పోలీసులు అమర్ సింగ్‌తో పాటు అతని ముగ్గురు సహచరులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం రీతా నలుగురు పిల్లలు తమ తాత వద్ద మైన్‌పురిలో నివసిస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: