మేడ్చల్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బొమ్మ తుపాకీతో ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించిన ఘటన కలకలం రేపింది. పోలీసులు నిందితులైన దంపతులను అరెస్ట్ చేసి, ఘటనలో ఉపయోగించిన బొమ్మ తుపాకీతో పాటు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఏడాది క్రితం క్లౌడ్ కిచెన్ వ్యాపారం ద్వారా అనిల్ కుమార్, అతని భార్య సుమన్‌కు ఇంద్రాణి బిశ్వాస్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా చాటింగ్ చేస్తూ అనిల్, ఇంద్రాణి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ కారణంగా ఇంద్రాణి, ఆమె భర్త చిత్తరంజన్ బిశ్వాస్ మధ్య విభేదాలు తలెత్తాయి.ఆగస్టు 2న చిత్తరంజన్‌కు ఫోన్ చేసిన అనిల్, ఇంద్రాణి గురించి ప్రశ్నిస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. అదే రోజు రాత్రి 1 గంట సమయంలో ఇంటికి వెళ్లి బలవంతంగా లోపలికి ప్రవేశించి, బొమ్మ తుపాకీ చూపిస్తూ అందరినీ చంపేస్తానని బెదిరించాడు. అనిల్ భార్య సుమన్ కూడా ఇంట్లోకి వెళ్లి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, బొమ్మ తుపాకీ మరియు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగుతోంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: