చేతులు, కాళ్లు కట్టేసి భర్తను హత్య చేసిన భార్య.. పీర్జాదిగూడలో దారుణం!

తెలంగాణ: హైదరాబాద్‌లోని పీర్జాదిగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తను హత్య చేసిన ఆరోపణలపై భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. రాఘవేంద్ర కాలనీకి చెందిన సత్యనారాయణ (51), ఆయన భార్య సునీత (44) మధ్య ఆగస్టు 6న గొడవ జరిగింది. ఈ క్రమంలో సునీత తన భర్త చేతులు, కాళ్లను చీరతో కట్టేసి, సెంట్రింగ్‌ కర్రతో తీవ్రంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అనంతరం సత్యనారాయణ వాహనం నుంచి జారిపడి గాయపడ్డాడని కుమారుడికి చెప్పింది. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.అయితే ఘటనపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి భార్యను విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *