అంతర్ జిల్లా దొంగ అరెస్ట్.. 30కి పైగా చోరీ కేసులు ఉన్నట్లు గుర్తింపు

బద్వేలు రూరల్ పోలీసుల ఘనత.. భారీ చోరీ కేసు ఛేదన

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్.. 30కి పైగా చోరీ కేసులు ఉన్నట్లు గుర్తింపు

బద్వేలు: బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అంతర్ జిల్లా నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి బంగారు, వెండి వస్తువులతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు.

గోపవరం మండలం మడకలవారిపల్లికి చెందిన చిట్టిబోయిన చెన్నయ్య కుటుంబంతో కలిసి తిరుపతికి వెళ్లిన సమయంలో, 2025 జూలై 5/6వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ.1.80 లక్షల నగదు, 4.6 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు కలిపి సుమారు రూ.3.25 లక్షల విలువైన సొత్తు అపహరణకు గురైంది.

దీనిపై బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.68/2026, సెక్షన్లు 331(4), 305 BNS కింద కేసు నమోదు చేశారు.

వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ N. క్రిష్ణయ్య, ఎస్‌ఐ T.V.N. చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు 03.10.2026 మధ్యాహ్నం 1:55 గంటలకు బద్వేలు–సిద్ధవటం రోడ్డులోని బయనపల్లి సబ్‌స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రధాన నిందితుడు కరణం కుమార్ @ గొల్ల కుమార్ (35), నెల్లూరు జిల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో నిందితుడు చోరీకి పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి వెంకటేశ్వర స్వామి బొమ్మతో కూడిన బంగారు ఉంగరం, లేత పచ్చరంగు రాయితో కూడిన మరో బంగారు ఉంగరం, రెండు చిన్న వెండి దీపపు సెమ్మెలు, రూ.5,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిపై ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో 30కి పైగా చోరీ కేసులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలిపారు. నిందితుడు క్రిమినల్ సిండికేట్‌గా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించడంతో ఈ కేసులో **BNS సెక్షన్ 111 (ఆర్గనైజ్డ్ క్రైమ్)**ను కూడా చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు.

భారీ చోరీ కేసును తక్కువ సమయంలో ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన బద్వేలు రూరల్ పోలీసులను పైఅధికారులు అభినందించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *