విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన ఓబులేసు కుటుంబానికి అండగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి
కడప /ప్రొద్దుటూరు : ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన ఓబులేసు కుటుంబాన్ని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబానికి తన వంతు అండగా నిలిచారు.ఓబులేసు కుమార్తె, ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న స్వాతి పేరుతో రూ.50 వేల డిపాజిట్ చేసి, ఆ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. బాలిక భవిష్యత్తుకు ఈ మొత్తం కొంతమేర భరోసాగా ఉంటుందని తెలిపారు.అంతేకాకుండా స్వాతి వివాహ సమయంలో కూడా తమ వంతు సహాయం అందిస్తామని కల్లూరు నాగేంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘ పెద్దలతో పాటు వైసీపీ నాయకులు ఆదిశేషారెడ్డి, సుబ్రహ్మణ్యం, బీసీ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: