బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి
పశ్చిమ బెంగాల్: ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మేనకోడలుగా పేర్కొంటున్న బృష్టి ముఖర్జీ ఘటక్ (28) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు సమాచారం.రాంపూర్హట్లోని తన నివాసంలో మధ్యాహ్నం ఆమె ఉరి వేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బృష్టి, ఆమె భర్త మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విడాకుల కోసం ఆమె కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.విడాకుల కేసు విచారణలో ఉండగా.. ఆమె కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు కుటుంబ వర్గాల ద్వారా సమాచారం.అయితే బృష్టి మృతికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: