Tv424x7
Andhrapradesh

అలాంటి వారి స్ఫూర్తితో.. పార్టీ కోసం పవన్ కల్యాణ్ కి రూ.10 కోట్ల విరాళం..

అమరావతి: జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పార్టీ కోసం రూ.10 కోట్ల విరాళం ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం అందజేస్తున్నట్లు వెల్లడించారు..దీనికి సంబంధించిన చెక్కును పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు సమక్షంలో కోశాధికారి ఎ.వి.రత్నంకి అందజేశారు..ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ..”స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్‌ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని విరాళంగా ఇచ్చారు. జనసేన కోసం ఓ బెల్దారీ మేస్త్రి రూ.లక్ష విరాళం అందించారు. ఇలా ఎందరో కూలీలు కూడా రూ.100, రూ.200 చొప్పున విరాళాలు ఇచ్చారు. అలాంటి వారి స్ఫూర్తితో సినిమాల ద్వారా వచ్చిన నా కష్టార్జితాన్ని, ప్రభుత్వానికి పన్నులు చెల్లించిన తర్వాత మిగిలిన డబ్బును పార్టీకి విరాళంగా ఇవ్వడం సంతోషంగా ఉంది. ఎన్నికల వేళ ఈ మొత్తం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నా” అని పేర్కొన్నారు..

Related posts

నడక మార్గం గుండా తిరుమలకు చేరుకున్న బాలివుడ్ నటి దీపికా పదుకుణే..

TV4-24X7 News

39వ వార్డు లో టి.డి.పి సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

నారావారిపల్లెలో గ్రామ దేవతలకు చంద్రబాబు పూజలు

TV4-24X7 News

Leave a Comment