దువ్వూరు: మండలంలోని సంజీవరెడ్డిపల్లె గ్రామపంచాయతీ “స్వచ్ఛ ఆంధ్ర-2026” స్వచ్ఛ గ్రామపంచాయతీ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి పి. సత్యవాణి అవార్డును గౌరవ కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు.
అలాగే ఉత్తమ స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్గా ఎంపికైన వి. సిసింద్రీ కూడా గౌరవ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత, పచ్చదనం తదితర అంశాల్లో చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించినట్లు అధికారులు తెలిపారు. సంజీవరెడ్డిపల్లె గ్రామపంచాయతీకి అవార్డు రావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: